ఈ నెలాఖరుకల్లా 'వైయస్ఆర్ నవశకం' సర్వే పూర్తి కావాలి..

ఈ నెలాఖరుకల్లా వైయస్ఆర్ నవశకం సర్వే పూర్తి కావాలి..
x
Highlights

నిర్లక్ష్యాన్ని విడనాడాలని, వైయస్ఆర్ నవశకం యొక్క ప్రయోజనాలు వాస్తవ లబ్ధిదారునికి చేరేలా చూడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీర పాండియన్ అధికారులను...

నిర్లక్ష్యాన్ని విడనాడాలని, వైయస్ఆర్ నవశకం యొక్క ప్రయోజనాలు వాస్తవ లబ్ధిదారునికి చేరేలా చూడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీర పాండియన్ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సర్వేను శనివారం కల్లా పూర్తి చెయ్యాలని ఆయన ఆదేశించారు. వైఎస్‌ఆర్ నవశకం సర్వేపై ఆయన గురువారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశమయ్యారు. బియ్యం కార్డులు, వైయస్ఆర్ పెన్షన్, జగన్నన్న విద్యా దీవేన, జగన్నన వసతి దీవెన, కాపు నేస్తం, ఇతర పథకాల సర్వే ఇంకా పూర్తి కాలేదని సమావేశంలో కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా మునిసిపాలిటీలలో బియ్యం కార్డు సర్వే పెండింగ్‌లో ఉన్నాయని, కమిషనర్లు, డిఎస్‌ఓ దీనిపై ప్రత్యక శ్రద్ధ వహించాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ సర్వే ఈ నెలాఖరుకల్లా పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ డేటా పూర్తి చేయడానికి మండల ఆరోగ్య మిత్రా, వైద్య సిబ్బందిని సమన్వయం చేయాలని జిల్లా సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. గ్రామం మరియు వార్డ్ సెక్రటేరియట్ల వద్ద లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించడంతో పాటు, ప్రజల నుండి అధికారులు అభ్యంతరాలు స్వీకరించాలన్నారు. ధృవపత్రాల జారీ కోసం మండల స్థాయిలో మేళాలను నిర్వహించడానికి కార్మిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహియుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్ర బాబు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా పౌర సరఫరా అధికారి పద్మశ్రీ, సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories