Top
logo

ఊరు కాని ఊరిలో.. ఉరి వేసుకొని ఆత్మహత్య

ఊరు కాని ఊరిలో.. ఉరి వేసుకొని ఆత్మహత్య
X
Highlights

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి విద్యుత్‌ టవర్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా...

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి విద్యుత్‌ టవర్‌ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం సమీపంలో ఉన్న పంటపొలాల్లో చోటుచేసుకుంది. మృతుని జేబులో ఉన్న ఆధా ర్‌ కార్డు, ఇన్సూరెన్స్‌ కార్డు ఆధారంగా మృతుడి ది ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా బగడ మండలం ఇచ్చాపూర్‌ గ్రామమని, అతని పేరు కళియమణి బెహర (40) అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఊరు కాని ఊరిలో ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అని ఆరాతీస్తున్నారు.

మృతుడి జేబులో బరంపురం నుంచి విజయనగరం వైపు ప్రయాణించేందుకు ఈ నెల 14వ తేదీన కొన్న రైలు టిక్కెట్‌ ఉంది. అతడి వద్దవున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయగా.. మృతుడు కొద్ది రోజులుగా కేరళలో పనిచేస్తున్నాడని తెలిపారు. కేరళ నుంచి బరంపురం వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు రైల్వే టికెట్‌ తీసుకొని ఉంటాడని, మధ్యలో నౌపడ స్టేషన్‌లో దిగి తేలినీలాపురం పంటపొలాల్లో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

keywords : odisha, man,commits suicide, climbing, high tension tower, srikakulam,tekkali

Web Titleodisha-man-commits-suicide-climbing-high-tension-tower
Next Story