తూర్పుగోదావరిలో క్షుద్రపూజల కలకలం

తూర్పుగోదావరిలో క్షుద్రపూజల కలకలం
x
Highlights

-తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజల కలకలం -కాకినాడు రూరల్ మండలం ఎరాయిడుపాలెంలో అలజడి -ఓ ఇంట్లో నుంచి అరుపులు కేకలు, మంత్రాలు -పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు -ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజలు కలకలంతో అలజడి చెలరేగింది. కాకినాడ రూరల్ మండలం ఎరాయుడుపాలెం శ్రీనివాస నగర్ లో ఓ ఇంట్లో వెలుగు చూసింది. అర్ధరాత్రి మంత్రాలు, అరుపులు రావడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కి పడ్డారు. కాల్చిన నిమ్మకాయలు, బియ్యం, పసుపు, కుంకుమ హారతి కర్పూరంతో పాటు కొన్ని ఫోటోలు., కాగితంపై రాసి ఉన్న పేపర్లు పడి ఉన్నాయి. క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ ఇంటిని సందర్శించారు. క్షుద్రపూజలు నిర్వహిస్తున్న హైదరాబాద్ కు చెందిన షేక్ బషీర్ తో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్షుద్రపూజలకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories