వైసీపీకి మద్దతు ప్రకటించిన ఓసీ సంక్షేమ సంఘం

వైసీపీకి మద్దతు ప్రకటించిన ఓసీ సంక్షేమ సంఘం
x
Highlights

ఈసారి ఎన్నికల్లో ఓసి సంక్షేమసంఘం వైసీపీకి మద్దతు పలికింది. ఈ మేరకు ఓసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు...

ఈసారి ఎన్నికల్లో ఓసి సంక్షేమసంఘం వైసీపీకి మద్దతు పలికింది. ఈ మేరకు ఓసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని జగన్ చెప్పడం హర్షించదగ్గ పరిణామం అని చెప్పారు.

ఓసీల విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయ మన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలను ఆదుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా అది నెరవేరలేదని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories