నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్

నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్
x
Highlights

నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు కుటుంబానికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయన భార్య మధుప్రియను మళ్లీ అరెస్ట్ చేశారు. శుక్రవారం బెయిల్‌పై విడుదలైన కొద్ది..

నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు కుటుంబానికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయన భార్య మధుప్రియను మళ్లీ అరెస్ట్ చేశారు. గురువారం బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన దగ్గర మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ డబ్బు పెద్ద ఉద్యోగం ఆశచూపడంతో ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఉద్యోగాల పేరుతో మధుప్రియ మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరోముండనం కేసులో అరెస్టైన మధుప్రియను మరోసారి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. కాగా విశాఖ సుజాతనగర్‌లో ఉన్న నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో ఆగస్టు 28న ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన రాష్ర్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది.

నూతన్‌ ఇంట్లో విశాఖ జిల్లా గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ అనివార్య కారణాల వలన‌ పని చేసి మానేశారు. అయితే ఆ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ ను తస్కరించి ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించావంటూ శ్రీకాంత్‌ను ఆ ఇంట్లో ఉండే కొందరు వ్యక్తులు, నూతన్ నాయుడు భార్య మధుప్రియ దుర్భాషలాడారు. అంతేకాదు అంతటితో ఆగకుండా శిరోముండనం కూడా చేశారు. ఈ విషయంపై శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో నూతన్ నాయుడు, మధుప్రియ తోపాటు మరికొంతమందిని అరెస్ట్ చేసింది.. అనంతరం కోర్టు వారికి రిమాండ్‌ విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories