రిలయన్స్ ఫుట్ బాల్ లో శ్రీ ప్రకాష్ ప్రథమ స్థానం

రిలయన్స్ ఫుట్ బాల్ లో శ్రీ ప్రకాష్ ప్రథమ స్థానం
x
శ్రీ ప్రకాష్ విద్యార్థులు
Highlights

రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేడియంలో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ నందు శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రధమ స్థానం సాధించారు.

తుని: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేడియంలో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ నందు జూనియర్స్ విభాగంలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రధమ స్థానం సాధించారు. ఈ పోటీల నందు 5 లీగ్ మ్యాచ్ లు జరుగగా ప్రతీ మ్యాచ్ నందు శ్రీ ప్రకాష్ విద్యార్థులు గెలిచి ప్రధమ స్థానంలో నిలిచి హైదరాబాద్ లో డిసెంబర్ 5 నుండి 9 వరకు జరుగనున్న జోనల్ పోటీలకు ఎంపికయ్యారు. గెలుపొందిన శ్రీ ప్రకాష్ జట్టు విద్యార్థులకు 25000 రూపాయల నగదు బహుమతి తో పాటు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందచేశారు.

ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని క్రీడల నందు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి విజయాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. తమ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించగలరని ఆయన ఆకాంక్షించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత సి హెచ్ వి కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం వి వి ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పరేష్ కుమార్ దాస్, వ్యాయమ ఉపాధ్యాయులు అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories