ఏలూరులో 300 దాటిన బాధితుల సంఖ్య!

ఏలూరులో 300 దాటిన బాధితుల సంఖ్య!
x
Highlights

శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 300 దాటింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు.

ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు... స్పృహ కోల్పోవడం, మెడ, నడుంనొప్పి, తల, కళ్లు తిరగడం, వంటి లక్షణాలతో శనివారం మ‌ధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఇంత మంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేంటో ఇప్పటికి స్పష్టత రాలేదు.

శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 300 దాటింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నా దీనికి కారణాలేమిటో తేలియకపోవడం కలవరం రేకెత్తిస్తోంది.

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని సీఎం జగన్‌ పరామర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఏలూరు చేరుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు.

ఏలూరులో యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులు, వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మెడికల్‌ క్యాంప్‌లు, ఇంటింటా ఆరోగ్యస్థితిపై సర్వే చేస్తున్నారు. ఏలూరు నగరంలో పరిస్థితిని మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఏలూరుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ బృందం రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories