రాబోయే కాలానికి రాముడొస్తాడు.. ఎన్టీఆర్, ఫోటో, ఫ్లెక్సీ వైరల్

రాబోయే కాలానికి రాముడొస్తాడు.. ఎన్టీఆర్, ఫోటో, ఫ్లెక్సీ వైరల్
x
‍‍NTR Morphing Picture
Highlights

టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతే కాదు ఏకంగా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు మారిదిగా సీఎం కూర్చిలో కుర్చున్న మార్ఫింగ్ ఫోటోను కూడా పెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ 23 మంది ఎమ్మెల్యే గెలిచారు. అప్పటి ముఖ‌్యమంత్రి కుమారుడు మంత్రి లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొందరు వైసీపీకి మద్దతు తెలిపారు. ఇక జూపూడి లాంటి నాయకులు ఆ పార్టీని వదలి ఒక్కొరుగా వైసీపీ గూటికి చెరుతున్నారు. చంద్రబాబు వయస్సు రీత్య భవిష్యత్తులో టీడీపీ మైలేజ్ రావాలంటే ఎన్టీఆర్ పార్టీలో కీలక పాత్ర షోషించాలిని కొందరు నేతలు బహాటంగానే చెబుతున్నారు. పార్టీని వీడిన నేతలు సైతం ఎన్టీఆర్ ఒక్కరే పార్టీని రక్షించగలరని వల్లభనేని వంశీ లాంటి వారు వ్యాఖ్యానించిన సందర్బాలు ఉన్నాయి.

అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఉంటుందని, ఎన్టీఆర్ కూడా వస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇంఛార్జ్ బూదాల అజితారావు చెందిన కొందరు ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అజితారావు మాజీ మంత్రి శిద్ద రాఘవరావు, టీడీపీ సినీయర్ నేత ఎమ్మెల్యే కరణం బలరాం చెందిన వర్గం వారని తెలుస్తోంది.అజితారావు 2014, 2019 ఎన్నిల్లో ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపును పోటీచేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిపోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేతిలో 31వేల మెజార్టీతో ఓటమిపాలైయ్యారు. అజితారావు వర్గం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంద్భంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన బ్యానర్ లో 2024 రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అని ఉంది. దీనిపై టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories