కోదండ‌రాముడికి బంగారు గొలుసు కానుక, కానుక సమర్పించిన ఎన్ఆర్ఐ భక్తుడు

కోదండ‌రాముడికి బంగారు గొలుసు కానుక, కానుక సమర్పించిన ఎన్ఆర్ఐ భక్తుడు
x
Highlights

(తిరుమల, శ్యామ్ నాయుడు)ఆధ్యాత్మిక నగరమైన తిరుప‌తిలో ఉన్న పురాతన ఆలయాల్లో కోదాండరామాలయం ఒకటి.జాంబవంతుడే తన స్వహస్తాలతో ఈ ఆలయాన్ని నిర్మించి సీతారాములకు...

(తిరుమల, శ్యామ్ నాయుడు)

ఆధ్యాత్మిక నగరమైన తిరుప‌తిలో ఉన్న పురాతన ఆలయాల్లో కోదాండరామాలయం ఒకటి.జాంబవంతుడే తన స్వహస్తాలతో ఈ ఆలయాన్ని నిర్మించి సీతారాములకు ఆరాధనలు చేసాడని స్థలపురాణం ద్వారా తెలుస్తొంది.నగరవాసులే కదా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ రామాలయాన్ని సందర్శిస్తుంటారు.టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఒకటైనా‌ ఈ కోదాండరామాలయం నిత్య,పక్ష,మాస,వార్షిక ఉత్సవాలతో అలరారుతొంది.

తిరుపతి కి చెందిన ఎన్ఆర్ఐ భ‌క్తుడు సి.శివకుమార్ ల‌క్ష్మీ డాల‌ర్‌తో కూడిన బంగారు గొలుసును రాములవారికి కానుకగా సమర్పించి మ్రొక్కు చెల్లించుకున్నారు.58.848 గ్రాముల విలువ గ‌ల ఈ ఆభ‌ర‌ణం విలువ రూ.2.58 లక్ష‌లు అని దాత తెలిపారు. ఈ మేర‌కు ఈ ఆభ‌ర‌ణాన్ని ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి దాత అంద‌జేశారు.ఈ సందర్భంగా ఆలయ పండుతులు దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించి, ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories