ఏపీలో ఎన్నికల కోడ్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..

ఏపీలో ఎన్నికల కోడ్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..
x
Highlights

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చిలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది… ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ...

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చిలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది… ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవనున్న మరో ఐదు స్థానాలతో పాటు ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దాదాపుగా సగం పైగా రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్‌ అమల్లోకి రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు వర్తించే అవకాశముంది. ఆ తరువాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలోనే వస్తే, ఇటు ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్‌, ఆ వెంటనే సాధారణ ఎన్నికల కోడ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories