లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా ఆ 10 లక్షలు తిరిగి ఇవ్వరు

లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా ఆ 10 లక్షలు తిరిగి ఇవ్వరు
x
Highlights

నూతన బార్ల విధానం 2020–21కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పాలసీ జనవరి 1వతేదీ నుంచి 2021 డిసెంబర్‌ 31...

నూతన బార్ల విధానం 2020–21కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పాలసీ జనవరి 1వతేదీ నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిసెంబర్‌ 6వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు లాటరీ తీసి నూతన బార్ల జాబితాను ప్రకటించనున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా తీసుకొని.. ఎక్కడ ఎన్ని బార్లు పెట్టాలో ప్రభుత్వం పేర్కొంది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం తొలగించి 487 బార్లకు మాత్రమే లైసెన్సులు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం బార్‌ లైసెన్స్‌ కావాలంటే దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బార్‌ లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చేది లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ నిన్నటినుంచి నుంచి మొదలైంది. డిసెంబర్‌ 6వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.ఆ తరువాత ఆఫ్‌లైన్‌లోనూ డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆఫ్‌లైన్‌ అప్లికేషన్లు జిల్లా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 7వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి అదే రోజు రాత్రి నూతన బార్ల జాబితాను ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories