వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. వీటికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు..

వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. వీటికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు..
x
Highlights

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌పి) కోసం వాహన కొనుగోలుదారులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్...

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌పి) కోసం వాహన కొనుగోలుదారులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు . రవాణా నిబంధనల ప్రకారం ఈ ఖర్చును తయారీదారు లేదా డీలర్ భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావు బుధవారం కృష్ణ జిల్లా వాహన డీలర్లతో సమావేశమై నిబంధనలను వివరించారు. ఈ సందర్బంగా వాహనం యొక్క ధరలో నంబర్ ప్లేట్ ధర ఉందని డిటిసి స్పష్టం చేసింది. నంబర్ ప్లేట్‌లో 20 మి.మీ సైజు గల క్రోమియం హోలోగ్రామ్, హాట్ స్టాంపింగ్ ఉండాలి.

డీలర్లు వాహనాలకు అతికించిన నంబర్ ప్లేట్ల రికార్డును నిర్వహించాలని ఆయన అన్నారు. నంబర్ ప్లేట్ తయారీదారులు కింది సంస్థల నుంచి అనుమతి పొందాలన్నారు.. అవి.. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పూణే, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ, వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, పూణే మరియు గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్, చెన్నై.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories