ప్రకాశం జిల్లాను వెంటాడుతున్న నివర్ ఫివర్

ప్రకాశం జిల్లాను వెంటాడుతున్న నివర్ ఫివర్
x
Highlights

* వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు * ముందస్తు చర్యలు చేపడుతున్న జిల్లా యంత్రాంగం * తీరప్రాంతంలోని 11 మండలాల్లో 98 తుఫాన్‌ షెల్టర్లు ఏర్పాటు * జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంల ఏర్పాటు * ఒక్కో మండలానికి ప్రత్యేక అధికారి కేటాయింపు

Nivar Cyclone Live Updates : నివర్ ఫివర్ ప్రకాశం జిల్లాను వెంటాడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీవర్షాలు కురిస్తే ప్రధానంగా రైతులు, మత్స్యకారులు, చేనేతలు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణశాఖ తాజా హెచ్చరికలతో మరింత అలజడి మొదలైంది. నెల్లూరు - ప్రకాశం జిల్లాలోని తూర్పు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే తీవ్ర నష్టాలు తప్పవని రైతులు భయపడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

వర్షాల కారణంగా చీరాల, వేటపాలెం ప్రాంతంలోని వేలాది చేనేత కార్మికుల పనులు నిలిచిపోయాయి. అలాగే తీర ప్రాంతంలోని మత్స్యకారులు తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో వేటను నిలిపివేశారు. యంత్రాంగం హెచ్చరికలతో పడవలు, వలలు ఇతర వేటసామాగ్రిని ఒడ్డుకు చేర్చుకున్నారు.

మరోవైపు తుఫాన్‌తో భారీ వర్షాలు కురిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ తదితర అన్నిశాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. భారీవర్షాలతో జిల్లాలో 41 ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌, ఇతర అవాంతరాలకు అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తీరప్రాంతంలోని 11 మండలాల్లో 98 తుఫాన్‌ షెల్టర్లు ఉన్నాయి. వాటిలో మరమ్మతులు చేపట్టానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు.

జిల్లాలోని సంబంధిత అధికారులతో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేక సమీక్ష చేపట్టారు. తీరప్రాంతంలో 11 మండలాలు ఉండగా సాధారణ జాగ్రత్తలకు మండల స్థాయి అధికారులతోపాటు ఒక్కో మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. తాజా పరిస్థితుల్లో రెండు, మూడు మండలాలకు జేసీ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories