ఇకనుంచి రైతులకు ఆ ఇబ్బంది ఉండదు : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకి సంబంధించి రైతులకు స్పష్టత ఇవ్వడానికి అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్నాం అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా..
కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకి సంబంధించి రైతులకు స్పష్టత ఇవ్వడానికి అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్నాం అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులో భాగంగా నిన్న తమిళనాడు..ఇవాళ ఏపీకి వచ్చానని అన్నారు. విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్‌హాల్లో వ్యవసాయ బిల్లులపై వ్యవసాయరంగ నిపుణులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకి సంబంధించి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా.. అన్ని మార్పులు చేసి బిల్లులు తీసుకొచ్చినట్టు ఆమె చెప్పారు. గతంలో రైతు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తన ప్రొడక్ట్ తీసుకెళ్లి అమ్ముకోవటానికి ఇబ్బంది ఉండేదని.. ఈ బిల్లులు తేవడం ద్వారా ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డ్ కి తీసుకువెళ్తే.. 8.5 పర్సెంట్ టాక్స్ లు చెల్లించాల్సి వచ్చేదని ఇప్పుడు అలాంటి టాక్స్ లు ఏమి ఉండవని.. రైతుకు డైరెక్ట్ బెనిఫిట్ అవుతుందని అన్నారు.
కాయగూరలు పండించే రైతులకు గిట్టుబాటు దొరక్క రోడ్ మీద వేసిన సందర్భాలు చాలా ఉన్నాయని.. అయితే ఇప్పుడు ఎక్కువ పండించినా వాటిని ప్రాసెసింగ్ చేసి టమాటో కిచప్ ,సాస్ చేయటానికి అవకాశం ఉందని చెప్పారు. రైతు తన పంటను వేయటానికి ముందే దానిని కొనుక్కోవటానికి అగ్రిమెంట్ కూడా చేసుకునే వెసులుబాటు ఈ బిల్లుల ద్వారా లభించిందని అన్నారు. చట్టాలని సవరించకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే రైతులకు ప్రోత్సాహం సరిగ్గా అందదని అగ్రిమెంట్ టర్మ్స్ ఏకపక్షంగా ఉండవని అన్నారు. ఈ నూతన బిల్లుల ద్వారా ఎవరికి నష్టం జరగదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గుంటూరు మిర్చికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నా.. అది మన రాష్ట్రం దాటి వెళ్ళలేదని.. ఇప్పుడు ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉందని ఆమె అన్నారు. పంజాబ్ లో ఉన్న కొన్ని సమస్యల కారణంగానే హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికి వచ్చారని నిర్మలా సీతారామన్ చెప్పారు
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTవిజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి
29 Jun 2022 7:33 AM GMT