జాతీయ సదస్సులో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

జాతీయ సదస్సులో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
x
Highlights

విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఈ నెల 3, 4 వ తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచారు.

విజయవాడ: విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఈ నెల 3, 4 వ తేదీల్లో డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ (DBT) స్పాన్సర్షిప్ తో “బయో ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ నానో క్యారియర్ డిజైన్ ఫర్ ఎంజైమ్ బేసిడ్ సైటోటాక్సీక్ థెరాప్యూటిక్స్ ఇన్ కాన్సర్ ట్రీట్మెంట్" (Biopharmaceutical Product Development and Nanocarrier Design for Enzyme Based Cytotoxic Therapeutics in Cancer Treatment) అను అంశం పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీల్లో పాల్గొని, తమ తమ పరిశోధనా అంశాలను సమర్థవంతంగా ప్రదర్శించి బహుమతులు పొందారు. నిర్మల ఫార్మసీ కళాశాల బీఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్ష సాత్విక, డాక్టర్ కె. సౌజన్య మార్గదర్శకత్వం లో “డాకింగ్ అధ్యయనాలు” అనే అంశంపై చేసిన ప్రెజెంటేషన్‌కు మొదటి బహుమతి లభించింది.

అలాగే, ఫార్మా డి తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు హర్షిత, అక్షిత , వి.పద్మజ మార్గనిర్దేశం లో టీకా కోసం మైక్రోబైమ్ థెరపీ అంశంపై చేసిన ప్రదర్శనకు మూడవ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన విజయంపై నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరస్పాండెంట్ రేవ్. సిస్టర్ జి. నిర్మల జ్యోతి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.పాముల రెడ్డి , అధ్యాపక వర్గం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు కళాశాల అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మార్గదర్శక ఉపాధ్యాయుల కృషి ఈ విజయాలకు కారణమని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories