Tadipatri: లింబోస్కేటింగ్‌తో తొమ్మిదేళ్ల బాలుడు అద్భుత విన్యాసాలు..

Nine-year-old boy Performs amazing stunts with limbo skating
x

Tadipatri: లింబోస్కేటింగ్‌తో తొమ్మిదేళ్ల బాలుడు అద్భుత విన్యాసాలు..

Highlights

Tadipatri: 9 సెకన్లలో 15 బార్లకింద మంటల్లోంచి బాలుడి సాహసం

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తొమ్మిదేళ్ల బాలుడు అద్భుత విన్యాసాలను ప్రదర్శించి ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. లింబోస్కేటింగ్‌లో మెళకువలతో అబ్బుర పరుస్తున్నాడు. స్కేటింగ్‌తో ప్రాణాంతక విన్యాసాలను ఆలవోకగా ప్రదర్శిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తాడిపత్రికి చెందిన అవినాశ్ అనే బాలుడు లింబోస్కేటింగ్‌తో వజ్ర బుక్ ఆఫ్ రికార్డు, వజ్రా నేషనల్ రికార్డ్, గ్లోబల్ రికార్డ్, హిందుస్థాన్ బుక్ ఆఫ్‌ రికార్డ్‌లో తన పేరును సగర్వంగా నమోదు చేసుకున్నాడు.

8.5 అంగుళాల ఎత్తులో... 15 మీటర్ల పొడవుతో ఏర్పాటుచేసిన 15 ఇనుపరాడ్ల కిందినుంచి మంటల్లోంచి 9 సెకన్ల వ్యవధిలోనే స్కేటింగ్‌తో దూసుకొచ్చే విన్యాసం చూపరులను అబ్బుర పరిచింది. ఈ విన్యాసాన్ని కళ్లారా తిలకించిన అనంతపురం డిఐజి అమ్మిరెడ్డి అభినందించారు. పిల్లలు ఎదిగే క్రమంలో ఆసక్తిని బట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలను ఆవిష్కరిస్తారని అవినాశ్ తాత వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories