Nimmagadda Ramesh Kumar takes charge as Andhra Pradesh SEC: ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ.. ఆఫీసులో మార్పులు..

Arun Chilukuri
Published on: 3 Aug 2020 12:04 PM IST
Nimmagadda Ramesh Kumar takes charge as Andhra Pradesh SEC: ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ.. ఆఫీసులో మార్పులు..
X

Nimmagadda Ramesh Kumar take charge as Andhra Pradesh SEC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11.15 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందన్నారు.

గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశామని రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కార్యాలయానికి స్వల్ప వాస్తు మార్పులు చేశారు. ఒకవైపు పూర్తిగా మూసివేసి, మరోవైపు నుంచి చాంబర్‌లోకి ప్రవేశించేలా మార్పులు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story