నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం..ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్

X
Highlights
ఏపీలొ రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ...
Samba Siva Rao8 Feb 2021 1:58 PM GMT
ఏపీలొ రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళ, బుధ వారాల్లో ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.
దీంతో ఏకగ్రీవాలపై లోతుగా పరిశీలించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్లు సోమవారం ఎస్ఈసీ కి నివేదిక సమర్పించారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఓకే చెప్పారు.
Web Titlenimmagadda ramesh kumar green signal to unanimous elections
Next Story