ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ

ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ
x

నిమ్మగడ్డ ఫైల్ ఫోటో 

Highlights

*చిత్తూరు, గుంటూరు జిల్లాలకు కలెక్టర్లను అపాయింట్‌ చేసిన ఎస్‌ఈసీ *చిత్తూరు కలెక్టర్‌గా ఎం.హరినారాయణ్‌ పేరును ప్రతిపాదించిన ఎస్‌ఈసీ *గుంటూరు కలెక్టర్‌గా బసంత్‌ కుమార్‌ పేరు సిఫారసు

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలకు కలెక్టర్లను అపాయింట్‌ చేస్తూ.. వారి పేర్లను లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్‌గా ఎం.హరినారాయణ్‌ పేరును ప్రతిపాదించిన నిమ్మగడ్డ.. గుంటూరు కలెక్టర్‌గా బసంత్‌ కుమార్‌ పేరును సిఫారసు చేశారు. ఇద్దరినీ కలెక్టర్లుగా నియమించాలని లేఖలో తెలిపారు. అలాగే.. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల అబ్జర్వర్లుగా అరుణ్‌, వివేక్‌ ప్రతిభ కనబరుస్తున్నారన్న ఎస్‌ఈసీ.. వారిద్దరి గత అనుభవాలూ ప్రస్తుతం ఎలక్షన్లు నిర్వహించడానికి తగినవి కావని అభిప్రయాపడ్డారు. అబ్జర్వర్లుగా ప్రతిభ చూపిస్తున్న నేపథ్యంలో మార్చడం కుదరదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories