AP Curfew: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew Extended in Andhra Pradesh
x

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడగింపు (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

AP Curfew: ఆగస్టు 14వరకు ఆంక్షలు కొనసాగింపు * రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ

AP Curfew: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న నైట్‌ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుండగా ఆగస్టు 14వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాలించాలని ప్రభుత్వం వెల్లడించింది. కార్యాలయాలు సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే 10వేల నుంచి 20వేల వరకు జరిమానా విధించనున్నారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేయనున్నారు. అలాగే 2 నుంచి 3 రోజుల పాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి తమకు ఫొటోలు పంపిచినా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories