AP News: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. 22A జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు!

5 Types Of Lands Removed From 22a List In AP: భూ యజమానులకు ఊరటనిచ్చేలా 22-ఏ నిషేధిత జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Jan 2026 4:06 PM IST
AP News: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. 22A జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు!
X

AP News: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. 22A జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు!

5 Types Of Lands Removed From 22a List In AP: నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. భూ యజమానులకు ఊరటనిచ్చేలా 22-ఏ నిషేధిత జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఇయర్ రోజున తన తొలి సంతకంతో ఈ ఫైల్‌పై ఆమోదం తెలిపారు.

ఈ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ పట్టా భూములను పూర్తిగా 22-ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అధికారులు సుమోటోగా పరిశీలించి భూమిని జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది.

22-ఏ నుంచి తొలగిస్తున్న భూములు ఇవే

ప్రస్తుతం ఈ కేటగిరీల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములు

♦ స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములు

♦ రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు

♦ ప్రైవేట్ పట్టా భూములు

ఈ భూములకు సంబంధించిన సరైన రికార్డులు ఉంటే వెంటనే 22-ఏ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.

ఏ పత్రాలు ఉంటే సరిపోతుంది?

భూమి యజమానులు కింది పత్రాల్లో ఏదో ఒకటి చూపినా సరిపోతుంది.

♦ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్

♦ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు

♦ 8-ఏ రిజిస్టర్లు

♦ డికెటీ పట్టాలు

♦ 10(1) రిజిస్టర్ / అడంగల్ / అసైన్‌మెంట్ రిజిస్టర్ / డీఆర్ దస్త్రాలు

అదనపు పత్రాల కోసం భూ యజమానులను తిప్పించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

భూ వివాదాలకు ముగింపు?

ఈ చర్యలతో భూములపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. భూ వివాదాలు తగ్గుతాయని, రైతులు, భూ యజమానులకు ఇది పెద్ద ఊరటనని ప్రభుత్వం భావిస్తోంది.

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ

"భూ యజమానుల హక్కులను కాపాడటమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అర్హులైన ఎవరికీ అన్యాయం జరగనివ్వం" అని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story