ఏపీ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు

ఏపీ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు
x
Highlights

* జగన్‌తో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ * వేద మంత్రోచ్ఛారణతో జగన్‌ను ఆశీర్వదించిన వేద పండితులు

ఏపీ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సీఎం జగన్‌తో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్ధానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణతో జగన్‌ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు జగన్‌కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు నెరవేరేలా వారికి శక్తిని అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories