పశువులకు సోకుతున్న కొత్త వైరస్.. శ్రీకాకుళం జిల్లాకి పాకిన 'లంపి'

New Virus in Srikakulam District
x

పశువులకు సోకుతున్న కొత్త వైరస్.. శ్రీకాకుళం జిల్లాకి పాకిన 'లంపి'

Highlights

*ఆందోళనలో పాడి పశువుల రైతులు, నివారణ చర్యలు ప్రారంభించిన అధికారులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కొత్త వైరస్ సోకుతుందండోయ్.... మనుషులకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఈ వైరస్ పశువులకు సోకుతోంది... జిల్లాలో లంపి అనే వైరస్ పశువులకు సోకుతుండడంతో వాటి చర్మం చిన్న చిన్న ముద్దలా తయారవుతోంది. పక్క రాష్ట్రం, పక్క జిల్లాల నుంచి వచ్చిన ఈ వైరస్.... తమ పశువులకూ సోకడంతో బెంబేలెత్తిపోతున్న పాడి రైతుల ఆవేదనపై హెచ్ ఎం టీవీ స్పెషల్ స్టోరీ..

ఈ వైరస్ ఎక్కువగా ఆవు, గేదె జాతులకు సోకుతోంది. దోమలు, ఈగల ద్వారా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకేముందు రెండు నుంచి మూడు రోజుల పాటు పశువుకు జ్వరం ఉండి... శరీరం అంతటా 2-5 సెంటీమీటర్ల పరిమాణంలో చర్మంపై పొక్కులు, దద్దుర్లు, బొబ్బలు కనిపిస్తున్నాయి.. ముద్ద కంతులు నోటిలోనూ, గొంతులోనూ, శ్వాసకోస నాళాల్లోను ఉంటున్నాయి... కాళ్ల వాపులు, పాల ఉత్పత్తి తగ్గడం, చూడి నిలవకపోవడం, వంధ్యత్వం వంటి లక్షణాలు తమ ఆవుల్లో కనిపిస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాధి సోకిన పశువులకు చికిత్స అందిస్తున్నామని, జిల్లా సరిహద్దు గ్రామాల్లో వ్యాక్సినేషన్ చేపట్టామని చెప్పారు పశువైద్యులు.... పశువులు ఒకచోట నుంచి వేరే చోటకు వెళ్లకుండా జిల్లాలో ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, పొందూరు, జి.సిగడాం మండలాల్లో వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేస్తామని పశుసంవర్ధక శాఖ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories