Vizianagaram: విజయనగరం స్టెరాయిడ్స్ కేసులో కొత్త కోణాలు..

New Twist In Hormone Growth Case In Vizianagaram
x

Vizianagaram: విజయనగరం స్టెరాయిడ్స్ కేసులో కొత్త కోణాలు..

Highlights

Vizianagaram అప్పటి నుంచి నా కూతురు వారి మాటలు వింటోంది

Vizianagaram: విజయనగరం జిల్లాలో కన్న తల్లి తనకు స్టెరాయిడ్స్ ఇచ్చిందంటూ నమోదైన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. తల్లి తనను హీరోయిన్ చేసేందుకు ఇంజక్షన్లు ఇచ్చిందంటూ కూతురు కేసు పెడితే.. ఇదంతా పాస్టర్లు చేయించారంటూ తల్లి ఆరోపిస్తోంది. ఇదంతా తన ఆస్తి కాజేసేందుకు పాస్టర్లు వేసిన స్కెచ్ అంటోంది. విజయనగరంకు చెందిన ఓ బాలిక.. తన తల్లిపై కేసు నమోదు చేసింది. తన శరీరం పెరిగేందుకు రోజూ ఇంజక్షన్లు ఇస్తూ.. చిత్ర హింసలకు గురిచేస్తోందంటూ ఛైల్డ్‌లైన్‌ను ఆశ్రయించింది. తనను హీరోయిన్ చేయాలనే ఆలోచనతో స్టెరాయిడ్ ఇచ్చిందంటూ ఫిర్యాదు చేసింది. కూతురుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మే.. వేధింపులకు గురిచేయడం విస్మయానికి గురిచేసింది.

అయితే ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాలిక తల్లి, పాస్టర్ల స్టేట్‌మెంట్లు ఇప్పుడు కేసులో కొత్త ట్విస్ట్‌లు తీసుకొచ్చాయి. తన కూతురు మానసిక పరిస్థితి బాగోలేదని తల్లి ఆనంద కుమారి చెబుతున్నారు. దేవరాజ్‌, అభిషేక్ అనే ఇద్దరు పాస్టర్లు తన కూతురిని హిప్నటైజ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ సెటిల్‌మెంట్‌ విషయంలో గతంలో ఒకరితో విభేదాలు వచ్చినట్లు చెబుతున్నారు ఆనంద కుమారి. ఆ సెటిల్‌మెంట్‌ విషయంలో వచ్చిన విభేదాలతోనే.. పాస్టర్‌ అభిషేక్‌‌ను వాడుకొని తన కూతురు ద్వారా కక్ష సాధిస్తున్నారి ఆరోపిస్తున్నారు. ప్రార్థనల పేరుతో తన కూతురుని హింసించారని.. ఆ వీడియో బయటపెడతాననే తన కూతురుతో కేసు పెట్టించారని చెబుతున్నారు. ప్రపంచం ముందు తనను కసాయి తల్లిగా చూయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆనంద కుమారి.. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు.

ఇక ఆనంద కుమారి ఆరోపణలను ఖండించారు పాస్టర్‌ అభిషేక్‌ పాల్‌. దెయ్యి పట్టిందని ఫోన్ చేస్తేనే తాను ప్రార్థనకు వెళ్లానని తెలిపారు. ఆ తర్వాత వారి కుటుంబంతో కాంటాక్ట్‌ కూడా లేదని.. ఈ కేసుకు తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నారు.

అభిషేక్, దేవరాజ్‌ అనే ఇద్దరు పాస్టర్లు తన కూతురును మానసికంగా వేధించారంటూ తల్లి ఆనందకుమారి ఆరోపిస్తుంటే.. పాస్టర్ అభిషేక్‌ మాత్రం ప్రస్తుత పరిణామాలకు దేవరాజ్‌ కారణమని చెబుతున్నారు. దేవరాజ్‌కు, ఆనంద కుమారికి ఆస్తి గొడవలున్నట్లు తెలిపారు. దీంతో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం దేవరాజ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా.. అతను అందుబాటులోకి వస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories