సీలేరు విద్యుత్‌ కేంద్రం సరికొత్త రికార్డు

సీలేరు విద్యుత్‌ కేంద్రం సరికొత్త రికార్డు
x
Highlights

ఆంధ్రప్రదేశ్​కు తలమానికంగా ఉన్న విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రం ఐదేళ్లుగా విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది.

సీలేరు: ఆంధ్రప్రదేశ్​కు తలమానికంగా ఉన్న విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రం ఐదేళ్లుగా విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది ఏపీ జెన్కో విధించిన లక్ష్యాన్ని వంద రోజులు ముందుగానే పూర్తిచేసుకుని... సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతి ఏడాది ఏపీ జెన్కో యాజమాన్యానికి విద్యుత్ ఉత్పత్తి విషయంలో లక్ష్యం విధిస్తుంది.

ఇందులో భాగంగా విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రానికి 2019 -20 ఆర్థిక సంవత్సరానికి 418 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించగా... డిసెంబర్ 12 రాత్రి 418.019 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. జల విద్యుత్ కేంద్రాల రికార్డుల్లో ఏడాదిలోపు సాధించాల్సిన లక్ష్యాన్ని సుమారు మూడు నెలలు ముందుగానే ఛేదించి ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రం సరికొత్త రికార్డులను తిరగరాసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories