పెళ్ళైన వారంరోజులకే భర్తకు విషం ఇచ్చిన నవ వధువు

పెళ్ళైన వారంరోజులకే భర్తకు విషం ఇచ్చిన నవ వధువు
x
Highlights

ఇష్టంలేని భర్తలను అంతమొందిస్తున్న భార్యల ఘటనలు ఈ మధ్య చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా పెళ్లైన వారం రోజులకె వైవాహిక జీవితానికి ఓ నవ వధువ భర్తను...

ఇష్టంలేని భర్తలను అంతమొందిస్తున్న భార్యల ఘటనలు ఈ మధ్య చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా పెళ్లైన వారం రోజులకె వైవాహిక జీవితానికి ఓ నవ వధువ భర్తను చంపాలనుకుంది. ఈ క్రమంలో అత్తవారి ఇంటికి వచ్చిన ఆమె.. భర్తకు విషం ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష‍్టం లేకున్నా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారని తెలుస్తోంది.

దాంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో భర్తపై పగ పెంచుకుంది. భర్త లింగమయ్యతో కాపురం చెయ్యడం ఇష్టం లేక అతనికి పాలల్లో విషం కలిపి ఇచ్చింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న లింగమయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories