ఆయన ఎవరు..? నా మేనత్త కొడుకు : ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఆయన ఎవరు..? నా మేనత్త కొడుకు : ఎమ్మెల్యే కోటంరెడ్డి
x
Highlights

ఆయన ఎవరు..? నా మేనత్త కొడుకు : ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఎవరు..? నా మేనత్త కొడుకు : ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీ ముగిసింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని నాయకులు ప్రకటించారు. నెల్లూరు ఘటన ఆరోజే సమసిపోయిందని.. అపోహలొనో ఆవేశం లోనో మాట్లాడిన సందర్భమని.. దీనిపై ఎంపిడిఓ సరళ కూడా పత్రిక ప్రకటన విడుదల చేశారని నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధనరెడ్డి వెల్లడించారు. సీఎం గారితో నెల్లూరు జిల్లా అభివృద్ధిపైనే జిల్లా నేతలు చర్చించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ఘటనపై కూడా చర్చించామన్నారు. కొన్ని మీడియా సంస్థలు దీనిమీద అత్యుత్సాహం ప్రదర్శించాయని అన్నారు.

నెల్లూరులో జరగననున్న రైతు భరోసా కార్యక్రమంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఎంపిడిఓ సరళ పెట్టిన కేసు అవాస్తవమని చెప్పిన కోటంరెడ్డి.. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి తనకూ మధ్య విబేధాలు లేవని అన్న కోటంరెడ్డి.. కాకాని నాకు స్వయానా మేనత్త కొడుకు.. నిన్న గాక మొన్న రొట్టెల పండుగ జరిగితే.. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్ చేసి నీ మేనకోడలు రొట్టెల పండుగ చూడాలని అంటోంది ఎవరికైనా చెప్పమంటే.. ఎవరో ఎందుకు నేనే తీసుకెళతా అని చెప్పి మా మేనత్త, మేనకోడలు తోపాటు ఇంటిల్లిపాది అందరిని తీసుకొచ్చానని అలాంటిది నాకు కాకానికి మధ్య విబేధాలు ఎందుకు ఉంటాయని కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories