Nellore: జీజీహెచ్‌ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై బదిలీ వేటు

Nellore GGH Prabhakar Transferred
x
నెల్లూరు జీజీహేచ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Nellore: తిరుపతి రుయా ఆస్పత్రికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Nellore: నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా ఆస్పత్రికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్‌సర్జన్‌పై ప్రభాకర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటుండగా.., విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ఆసుపత్రిలో ప్రభాకర్‌ బాధితులు చాలామంది ఉన్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇక ప్రభాకర్‌ను విచారించిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేసాయి కమిటీలు

నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినికి ఉన్నతాధికారి లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. వాటి ఆధారంగా సదరు ఉన్నతాధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. విచారణలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించాయి. నెల్లూరు జీజీహెచ్‌ మెడికోలు, వైద్యులను ఆరా తీశాయి. మరో వైపు రెండు కమిటీల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందకముందే నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. ప్రభాకర్‌ను తిరుపతి రుయాకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆడియో రికార్డింగ్‌ టేపులు రాష్ట్రంలో సంచలనం గామారాయి. జీజీహెచ్‌లోని హౌస్‌ సర్జన్‌ను వైద్యాధికారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌ చల్‌ కావడంతో దీనిపై ఇన్‌ఛార్జి కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories