కిడ్నాప్‌ : 2 నెలల చిన్నారిని ఎలా ఎత్తుకెళుతుందో చూడండి..

కిడ్నాప్‌ : 2 నెలల చిన్నారిని ఎలా ఎత్తుకెళుతుందో చూడండి..
x
Highlights

నెల్లూరు జిల్లాలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 నెలల పాప కిడ్నాప్‌కి గురైన సంగతి తెలిసిందే. ఈ పాప ఆచూకీ దొరికింది....

నెల్లూరు జిల్లాలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 నెలల పాప కిడ్నాప్‌కి గురైన సంగతి తెలిసిందే. ఈ పాప ఆచూకీ దొరికింది. కావలిలో ఓ మహిళ పాపను తీసుకుని ట్రైన్ దికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళ చంటి బిడ్డతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైపు వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామానికి చెందిన వేము గోపి, కృష్ణవేణి దంపతులు. సొంత ఊరిలోకూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా సొంత ఊరిలో పనులు లేకపోవడంతో జీవనోపాధి కోసం తమ ముగ్గురు ఆడపిల్లలతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. మంగళవారం రాత్రి తణుకులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జనరల్‌ బోగీలో ఎక్కారు. అదే బోగిలో ఎక్కిన ఇద్దరు మహిళలు వీరిపక్కనే కూర్చొని కొంతదూరం వచ్చాక మాటలు కలిపారు. మీ ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరిని అమ్మండంటూ వారితో బేరమాడారు. అందుకు కృష్ణవేణి, గోపి అంగీకరించలేదు. అంతేకాదు ఏమి చేసైనా తమ పిల్లల్ని పోషించుకుంటామని..

ఎవరికీ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇంతలో అందులో ఇద్దరు పిల్లలు నిద్రకి ఉపక్రమించడంతో బోగీలోని సీట్ల మధ్యలో కింద పడుకోబెట్టారు. విజయవాడకు వచ్చాక రెండు నెలల పాపను కూడా వారి మధ్యే ఉంచారు. చీరతో ఉయ్యాల వేస్తే హాయిగా నిద్రపోతుందని ఆ ఇద్దరు మహిళలు సలహా ఇవ్వడంతో గోపి రెండు సీట్లకు చీరతో ఉయ్యాల కట్టి పాపను అందులో పడుకోబెట్టారు. విజయవాడ నుంచి కావలి మధ్యలో గోపి దంపతులు నిద్రలోకి జారుకున్నారు.

కావలి రైల్వేస్టేషన్‌ దాటాక మెలుకువ వచ్చి పిల్లల్ని నిద్ర లేపుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల పసిపాపకు పాలిచ్చేందుకు ఉయ్యాలలో చూడగా పాప లేదు.. దాంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పరిసరాలు అంతా గాలించారు. ఎక్కడా పాప దొరకలేదు. అయితే వీరిపక్కనే ఉన్న ఇద్దరు మహిళలు సైతం లేకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే దిగి పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మహిళల కోసం అన్నీ రైల్వేస్టేషన్లలో అయిదు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు రైల్వే.. రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీని పరిశీలించారు.

ప్రకాశం జిల్లా చీరాల నుంచి నెల్లూరు జిల్లా గూడూరు వరకు రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కావలి పట్టణ రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో బిడ్డతో దిగిన ఓ మహిళ పవన్‌కుమార్‌ అనే వ్యక్తి ఆటో ఎక్కి కావలి ఆర్టీసీ బస్టాండులో దిగింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చి ఆటోడ్రైవర్లను విచారించగా.. వారు చంటిబిడ్డతో ఆ మహిళ వెళ్లిందని సమాధానం ఇచ్చారు. ఆమె సింగరాయకొండ వైపు వెళ్లే బస్సులో ఎక్కడం రికార్డు అయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories