Top
logo

Sonu Sood: సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ

Nellore District Collector Letter To Sonu Sood For Help
X

సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Sonu Sood: వెంటనే సానుకూలంగా స్పందించిన రియల్ హీరో * విలువైన ఆక్సిజెన్ జనరేటర్‌ను అందిస్తానని హామీ

Sonu Sood: కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టం వచ్చింది సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నాడు సోనూసూద్. తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు ఈ రియల్ హీరో. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్.. విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీఇచ్చారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Web TitleSonu Sood: Nellore District Collector Letter To Sonu Sood For Help
Next Story