NEET Exam 2020: నేడే నీట్.. ఏర్పాట్లు పూర్తిచేసిన తెలుగు రాష్ట్రాలు

NEET Exam 2020: నేడే నీట్.. ఏర్పాట్లు పూర్తిచేసిన తెలుగు రాష్ట్రాలు
x

NEET Exam 2020

Highlights

NEET Exam 2020 | కరోనా కొంత వెసులు బాటు తరువాత ఎట్టకేలకు ఒక్కో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

NEET Exam 2020 | కరోనా కొంత వెసులు బాటు తరువాత ఎట్టకేలకు ఒక్కో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పరీక్షలు పూర్తిచేసిన ప్రభుత్వాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ కు సిద్ధమయ్యింది. నేడు దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

వైద్య విద్య ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షాకేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఎప్పుడు పరీక్షాకేంద్రానికి రావాలో ముందేవారికి మెసేజ్‌లు పంపించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకేసారి రాకుండా నివారించాలనేది ఉద్దే శం. జ్వరం ఉందో లేదో ప్రవేశద్వారం వద్ద ఒక్కో అభ్యర్థిని పరిశీలించి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లనుఅనుమతిస్తారు.

తెలంగాణ నుంచి ఈ ఏడాది 55,800 మంది నీట్‌కు హాజరు కానున్నారు. ఒక్కో గదిలో కేవలం 12 మంది ఉండేలా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్‌ రాసే విద్యార్థులకు డ్రెస్‌కోడ్‌ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా వంటివి) ఓ గంట ముందే పరీక్షా కేంద్రా లకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాల్‌ టికెట్లో మూడు పేజీలుంచి, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా ఉంచారు. నీట్‌ ఫలితాలు వచ్చే నెల రెండోవారంలో వస్తాయని ఎన్‌టీఏ ప్రకటించింది.

ఏపీలో ప్రత్యేక రైళ్లు

నీట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆదివారం జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ-గూడూరు, విజయవాడ-విశాఖపట్నం మధ్యన రెండు రైళ్లను నడుపుతోంది. గూడూరు జంక్షన్‌-విజయవాడ జంక్షన్‌ మధ్య నడిచే రైలు నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ప్రత్యేక రైలు విజయవాడ జంక్షన్‌, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.

ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. ముందుగా 2,546 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వీటి సంఖ్యను 3,843కి పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో 61,890 మంది పరీక్ష రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, తెలంగాణలో 55,800 మంది అభ్యర్థులకు 112 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్‌ పరీక్షకు భయపడి తమిళనాడులోని మధురైలో ఓ విద్యార్థిని శనివారం ఆహ్మత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులకు నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories