Top
logo

ఆంధ్రప్రదేశ్ ‌ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని

Neelam Sahanai
X
Neelam Sahanai
Highlights

-1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని -ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి రిలీవ్ అయిన నీలం సాహ్ని -రేపు బాధ్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా నీలంసాహ్ని నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని ఇటీవల సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. నూతన సీఎస్‌గా నీలం సాహ్ని గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. నవ్యాంధ్రకు ఆమె తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా , నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పని చేశారు.

Next Story