Vizag: విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్‌.. పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

Navy Marathon in Vizag
x

Vizag: విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్‌.. పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

Highlights

Vizag: ఫుల్‌ మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌, 10K, 5K కేటగిరిలో మారథాన్‌

Vizag: విశాఖలో ప్రతి ఏటా నిర్వహించే నేవీ మారథాన్-2023 బీచ్ రోడ్‌లో ప్రారంభమైంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె, 5కె కెటగిరీలలో మారథాన్ ఏర్పాటు చేశారు. ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కార్ ప్రారంభించగా.. హాఫ్ మారథాన్ ను జెండా ఊపి వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ ప్రారంభించారు.

ఇక.. వైజాగ్ నేవీ మారథాన్ 2023లో 10కె రన్‌ను విశాఖ సీపీ డాక్టర్‌ రవిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో 2వేల 5 వందల మంది రిజిస్టర్‌ చేసుకొని పాల్గొన్నారు. ప్రతి ఏటా నేవీ డే ఉత్సవాలకు ముందు నేవీ మారథాన్ నిర్వహిస్తారు. ఈ రన్ లో అథ్లెట్స్‌, నేవీ సిబ్బంది, నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories