ఏపీ ప్రభుత్వంపై 'నవయుగ' దాఖలు చేసిన పిటీషన్ విచారణ వాయిదా

ఏపీ ప్రభుత్వంపై నవయుగ దాఖలు చేసిన పిటీషన్ విచారణ వాయిదా
x
Highlights

పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం గతనెల ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన కాంట్రాక్టర్ నవయుగ కోర్టును...

పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం గతనెల ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన కాంట్రాక్టర్ నవయుగ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్ కేంద్రం పనులను కొనసాగించడంతో పాటు ఈ కాంట్రాక్టును మరెవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాదనలు విన్న అనంతరం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories