Tirumala: వైభవంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం

Navaratri Brahmotsavam in Tirumala
x

Tirumala: వైభవంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం

Highlights

Tirumala: రాత్రి సర్వభూపాల వాహనంపై విహరించనున్న స్వామివారు

Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో కన్నులపండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కలసి శ్రీ మలయప్ప స్వామివారు కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటిని ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు విహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories