రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు
x
Highlights

ఎస్.రాయవరం: మండలంలోని మేజర్ పంచాయితీ తిమ్మాపురం గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విఆర్వో గోపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు....

ఎస్.రాయవరం: మండలంలోని మేజర్ పంచాయితీ తిమ్మాపురం గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విఆర్వో గోపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్డురోడ్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం గ్రామస్థులతో ప్రభుత్వ పాఠశాల హె.ఎం ఎం.వెంకయ్య ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని పొందవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న ప్రాధాన్యత గురించి వివరించారు.

ఐ.పోలవరంలో జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ

ఐ.పోలవరం: జాతీయ ఓట,ర్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ఐ.పోలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి భారత గోవింద రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల తహశీల్దార్ అజీజ్ హుస్సేన్ పాల్గొని ఓటు ప్రాధాన్యత గురించి వివరించారు. సమాజంలో ప్రతి పౌరుడు ఓటు ద్వారా నిజాయతీగల నాయకుల్ని ఎన్నుకోవాలని అన్నారు. ఓటు వజ్రాయుధమని గ్రామ కార్యదర్శి గోవిందరావు వివరించారు.

ఈ కార్యక్రమంలో వీఆర్వో స్టీఫెన్, మండల విద్యాశాఖ అధికారి అక్క వెంకటేశ్వరరావు, మండల పరిషత్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహశీల్దార్ చిర్రావూరి వెంకట్రావు, పంచాయతీ సిబ్బంది దంగుడు బియ్యం నాగబాబు, బాలయ్య, రాయపరెడ్డి పాల్గొన్నారు.

తహసీల్దార్ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం

జగ్గంపేట: మండల తహసీల్దార్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి జగ్గంపేట లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, రెవెన్యూ సిబ్బంది తో ర్యాలీ నిర్వహించి, కాంప్లెక్స్ వద్ద నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను తహసీల్దార్ కృష్ణమూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందిన పలువురుకు ఓటు గుర్తింపు కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories