శ్రీకాళహస్తిలో నేషనల్ లోక్ అదాలత్

శ్రీకాళహస్తిలో నేషనల్ లోక్ అదాలత్
x
Highlights

పట్టణంలోని సబ్ కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది.

శ్రీకాళహస్తి: పట్టణంలోని సబ్ కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమములో సీనియర్ సివిల్ జడ్జ్ గురునాధ్,జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్,లోక్ అదాలత్ మెంబెర్లు,బార్ కౌన్సిల్ మెంబెర్లు, న్యాయవాదులు మరియు అన్ని శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ గురునాధ్ మాట్లాడుతూ...దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులను, కక్షిదారులు లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకుంటే వారికి సమయం, డబ్బు కలిసి వస్తుందని చెప్పారు.

లోక్ అదాలత్ లో పరిష్కారమైన కేసులు పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని తెలియజేశారు.ఈ విషయాలను ప్రజలు తెలుసుకొని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని చెప్పారు. పోలీసులు, లాయర్లు, మీడియా సహకారంతో ఈ లోక్అదాలత్ కేసులను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ జరిగిన నేషనల్ లోక్ అదాలత్ లో మొత్తం 80 కేసులు పరిష్కరించబడింది. మొత్తం నగదు రూపంలో రూపాయలు 23,50,953/- రికవరీ అయింది. సివిల్ కేసులు- 09, క్రిమినల్ కేసులు ౭౧ పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ శాఖ, బ్యాంకు అధికారులు, కోర్ట్ సిబ్బంది మరియు అన్ని శాఖ అధికారులు ..మొదలైనవాళ్లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories