Republic Day 2020: జెండా ఆవిష్కరణలో మంత్రి అవంతి పొరపాటు

Republic Day 2020: జెండా ఆవిష్కరణలో మంత్రి అవంతి పొరపాటు
x
Highlights

విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పొరపాటు చోటు చేసుకుంది. తలకిందులుగా కట్టిన జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు.

విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పొరపాటు చోటు చేసుకుంది. తలకిందులుగా కట్టిన జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించడం పూర్తయ్యేవరకు ఎవరూ గమనించలేదు. అయితే చివరకు మంత్రి అవంతి, అధికారులు జెండాను తలకిందులుగా కట్టారని గుర్తించి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. రివర్స్‌లో ఎగురుతున్న పతాకాన్ని అవనతం చేసి.. సరిదిద్ది మళ్లీ ఆవిష్కరించారు. ఈ ఘటనతో వైసీపీ కార్యాలయ సిబ్బందిలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

జాతీయ జెండా విషయంలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ పరిణామంపై టీడీపీ నేతలు సెటైర్లు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకులకు రివర్స్‌లో వెళ్లడం కామన్ అని, జాతీయ పతాకాన్ని సైతం అలా ఆవిష్కరించడం తగదని ట్రోల్ చేస్తున్నారు. ఇదోలావుంటే కొంతకాలంగా మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. గతంలో కూడా అయ్యప్ప మాల ధరించి చెప్పులు వేసుకున్నారు. ఆ సమయంలో అవంతిపై విమర్శలు వచ్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories