కేవీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు

కేవీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు
x
ప్రిన్సిపాల్ డాక్టర్ సివి రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ ఇందిరాశాంతి,అధ్యాపకులు విద్యావాహిని, వెంకటలక్ష్మి
Highlights

నగరంలోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉన్నత విద్యలో బోధనా పద్ధతుల పాత్ర అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సివి రాజేశ్వరి తెలిపారు.

కర్నూలు: నగరంలోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉన్నత విద్యలో బోధనా పద్ధతుల పాత్ర అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సివి రాజేశ్వరి తెలిపారు. బుధవారం కళాశాలలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు బోధనా పద్ధతుల్లో మార్పులు తప్పనిసరి అన్నారు. అందులో భాగంగా సదస్సులో ప్రధానంగా నూతన పోకడలు, నూతన అంశాలు, సాంకేతికత నైతిక విలువలు అనే నాలుగు అంశాలపై సదస్సులో వివరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరాశాంతి, అధ్యాపకులు విద్యావాహిని, వెంకటలక్ష్మి, సునిత తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories