నేడు గుంటూరుకు ప్రధాని.. పలు శంకుస్థాపనలు.. అనంతరం బహిరంగసభ

నేడు గుంటూరుకు ప్రధాని.. పలు శంకుస్థాపనలు.. అనంతరం బహిరంగసభ
x
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించనున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. తూర్పు గోదావరి,...

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించనున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుంటూరు నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాని హోదాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. అనంతరం బహిరంగసభలో గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన భహిరంగసభలో పాల్గొంటారు.

ఈ సభకు 'ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే'అని నామకరణం చేశారు. ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ ఐజీ ఆలోక్‌ వర్మ, గుంటూరు రేంజ్‌ ఐజీ కేవీవీ గోపాలరావు, గుంటూరు అర్బన్, కృష్ణా, ప్రకాశం ఎస్పీలు, విజయవాడ డీసీపీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories