రైల్వేజోన్‌ కానుకగా ఇవ్వడానికి విశాఖ వచ్చా : ప్రధాని మోదీ

రైల్వేజోన్‌ కానుకగా ఇవ్వడానికి విశాఖ వచ్చా : ప్రధాని మోదీ
x
Highlights

విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాచైతన్య సభ సూపర్ సక్సెస్ అయింది. సభకు వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రియమైన...

విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాచైతన్య సభ సూపర్ సక్సెస్ అయింది. సభకు వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రియమైన సోదరీసోదరమణులారా అంటూ మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డకు రావడం చాలా సంతోషకరంగా ఉందని మోదీ అన్నారు.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖ రైల్వేజోన్‌ కానుకను ఇవ్వడానికి విశాఖ వచ్చానని చెప్పిన మోదీ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తమవంతు సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే నని చెప్పారు. సౌత్‌కోస్ట్‌ రైల్వే జోన్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తనపై విషప్రచారం చేస్తున్నారని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు. కాగా ఇప్పటికే విశాఖను స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చామని.. ఈ సిటీ కోసం వేలకోట్ల రూపాయలను వెచ్చించామని గుర్తుచేశారు. అలాగే విశాఖలో ప్రతిష్టాత్మక ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తామని చెప్పారు. స్థానిక ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories