సీఎం జగన్ నిర్ణయం హర్షణీయం : ఆర్ నారాయణమూర్తి

సీఎం జగన్ నిర్ణయం హర్షణీయం : ఆర్ నారాయణమూర్తి
x
Highlights

తరతరాలుగా పేదవారు అలాగే ఉండిపోతున్నారన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సరైన చదువులు లేకపోవడమే అని ఆయన అన్నారు. తూర్పు...

తరతరాలుగా పేదవారు అలాగే ఉండిపోతున్నారన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సరైన చదువులు లేకపోవడమే అని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుదురులో వెలమ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదవారికి ఇంగ్లీష్ మీడియం చదువులు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఒకటో తరగతి నుంచి ఆరోతరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిచేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని అన్నారు.

వెనుకబడిన తరగతులవారు ఇంగ్లిషు చదువులు చదవలేక వెనుకబడిపోతున్నారని.. తాను తానుతీసిన ఎర్రసైన్యం సినిమాలో ఇదే అంశాన్ని చూపించినట్టు గుర్తు చేశారు. ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నవారే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని, తెలుగుమీడియంలో చదువుకుంటున్న పేదవర్గాల పిల్లలు సెక్యూరిటీ గార్డు, పోలీసు కానిస్టేబుల్‌ వంటి చిన్పపాటి ఉద్యోగాలకే పరిమితమవుతున్నట్టు పేర్కొన్నారు.తన అనుభవాలను, జీవితంలో తనకు ఎదురైనా సమస్యలనే సినిమాలుగా తీస్తున్నట్టు ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories