నారాయణ కాలేజ్ బిల్డింగ్‌పై నుండి దూకి స్టూడెంట్ ఆత్మహత్య

Narayana college inter student committed suicide by jumping off from college building at Madhurawada in Vigag
x

నారాయణ కాలేజ్ బిల్డింగ్‌పై నుండి దూకి స్టూడెంట్ ఆత్మహత్య

Highlights

నారాయణ కాలేజ్ భవనంపై నుండి దూకి చంద్ర వంశి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం మధురవాడలో గురువారం చోటుచేసుకుంది. మధురవాడలోని...

నారాయణ కాలేజ్ భవనంపై నుండి దూకి చంద్ర వంశి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం మధురవాడలో గురువారం చోటుచేసుకుంది. మధురవాడలోని పరదేశీపాలెంలో ఉన్న నారాయణ కాలేజ్‌లో ఈ ఘటన జరిగింది. చంద్రవంశీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. చంద్రవంశీ సరిగ్గా చదవడం లేదని లెక్చరర్ మందలించిన కారణంగానే మనస్తాపంతో బిల్డింగ్‌పై నుండి దూకి చనిపోయినట్లుగా తెలుస్తోంది. చంద్రవంశీ స్వస్థలం ఒడిషాలోని రాయ్‌పూర్.

చంద్రవంశీ ఆత్మహత్యపై కాలేజ్ నిర్వాహకులు ఏం చెబుతున్నారు?

చంద్రవంశీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు పరదేశీపాలెంలోని నారాయణ కాలేజ్ నిర్వాహకులు స్పందించారు. చంద్రవంశీ ఇటీవల రాసిన పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదని, ఇదే విషయమై వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామన్నారు. ఆ తరువాతే చంద్రవంశీని బాగా చదువుకోవాల్సిందిగా మందలించినట్లు కాలేజ్ నిర్వాహకులు తెలిపారు.

అయితే, చంద్రవంశీ చదువులో వెనుకబడ్డారని మందలించడంతో పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories