మహిళను మోసం చేసిన కామాంధుడికి టీటీడీ పదవి కట్టబెట్టారా?

మహిళను మోసం చేసిన కామాంధుడికి టీటీడీ పదవి కట్టబెట్టారా?
x
Highlights

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్పీ నారా లోకేశ్ మరోసారి నిప్పులుచెరిగారు.

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్పీ నారా లోకేశ్ మరోసారి నిప్పులుచెరిగారు. ఒక మహిళను మోసం చేసిన కామాంధుడికి టీటీడీ పదవి కట్టబెట్టారా? అని ప్రశ్నించారు.పెళ్లి చేసుకుంటాననని నమ్మించి ఒక మహిళ జీవితంతో ఆటలాడుకున్న కరణ్ రెడ్డికి టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ పదవి అప్పగించడం దారుణమని లోకేశ్ దుయ్యబట్టారు. హిందూ ధార్మిక పరిరక్షణకు ఇంతకుమించి మంచి వ్యక్తి మీకు దొరకలేదా? అని నిలదీశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు ఇకనైనా ఆపండి జగన్ రెడ్డి గారూ అంటూ హితవు పలికారు. టీటీడీపై మీ 'దరువు' ఇకనైనా ఆపకపోతే ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

హిదువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలను ఏంచెయ్యాలనుకుంటున్నారు? అంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. డిక్లరేషన్ దగ్గర్నుంచి భక్తులపై లాఠీచార్జి వరకు అన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి,ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్లు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్,సంక్షేమ హాస్టల్స్ కు టమోటా పేస్ట్,టమోటా కచప్,గిచప్ ఏమయ్యాయి?అని లోకేశ్ ప్రశ్నించారు. పాదయాత్రలో మీరు చెప్పిన పులిహోర కబుర్లు గుర్తులేవా?అని ఎద్దేవా చేశారు.
Show Full Article
Print Article
Next Story
More Stories