ఏపీలో నియంత పాల‌న న‌డుస్తుంది.. ఒక్క రూపాయి ఇవ్వడం లేదు

ఏపీలో నియంత పాల‌న న‌డుస్తుంది.. ఒక్క రూపాయి ఇవ్వడం లేదు
x
Naralokesh(File photo)
Highlights

ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి నారా లోకేశ్. కరోనా నియంత్రణకు వైద్య పరికరాలే లేవంటూ ఆరోపించిన ఇద్దరు ప్రభుత్వ ఉధ్యోగుల‌పై వేటు వేయడాన్నిలోకేశ్ త‌ప్పుబ‌ట్టారు.

ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి నారా లోకేశ్. కరోనా నియంత్రణకు వైద్య పరికరాలే లేవంటూ ఆరోపించిన ఇద్దరు ప్రభుత్వ ఉధ్యోగుల‌పై వేటు వేయడాన్నిలోకేశ్ త‌ప్పుబ‌ట్టారు.ఈ ఇద్దరినీ సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన లోకేష్, వెంటనే ఆ ఇద్దరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కూడా ప్ర‌భుత్వం అలాంటి ఆరోప‌ణ‌లు చేస్తూ..వీడియో పోస్టు చేశారు. దీంతో ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ విధుల‌నుంచి తొలిగించింది ప్ర‌భుత్వం.

కరోనా ని ఎలా క‌ట్ట‌డి చేయాల‌ని అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డిని సస్పెండ్ చెయ్యడాన్ని ఖండిస్తున్నాని . ట్వీట్ చేశారు. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికల ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలి?' అని లోకేష్ ప్రశ్నించారు. 'జగన్ అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చింది.' అని లోకేష్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా న‌గ‌రి క‌మిష‌న‌ర్ వెంక‌ట్రామిరెడ్డి వీడియో జోడించి ' రాష్ట్రంలో నియంత పాల‌న న‌డుస్తుంది. చేత‌గాని ప్ర‌భ‌త్వాన్ని ప్ర‌శ్నిస్తే సస్పెండ్ చేస్తారా జ‌గ‌న్ గారు అని ట్వీట్ చేశారు. మాస్కులు వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ కిట్లు కొన‌డానికి ప్ర‌భుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు' అని లోకేష్ అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories