నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం

Nara Lokesh Yuvagalam Padayatra is Successful
x

నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం

Highlights

Nara Lokesh: విజయనగరం జిల్లా భోగాపురంలో విజయోత్సవ సభ

Nara Lokesh: నారా లోకేష్ చేపట్టిన యువగళం సూపర్ సక్సెస్ అయ్యింది. టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. యువగళం ఇచ్చిన విజయ స్ఫూర్తితో ఎన్నికల కురుక్షేత్రానికి సమాయత్తం కాబోతోంది అధిష్టానం. విజయనగరం జిల్లాలో నిర్వహించే విజయోత్సవ సభ నుంచి ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందుకే యువగళం విజయోత్సవ సభను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేసింది. నేడు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ ఎత్తున సభను నిర్వహిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు సభకు హాజరుకానున్నారు.

సభలో 6లక్షలు మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనబోతుండటంతో.. జనసైకులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర యేళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ లేకపోవడంతో యువత తరపున పోరాటం మొదలు పెట్టారు నారా లోకేష్. తొలుత ఈ పాదయాత్రలో యువతరం కష్టాలను తెలుసుకుని వారి బాధలను తీర్చేందుకు సన్నద్ధమయ్యారు. అయితే కొద్ది రోజుల్లోనే పాదయాత్రకు విశేష ఆదరణ రావడంతో వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ప్రతీ ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని లోకేష్ కు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. అలా తక్కువ టైంలోనే లోకేష్ పాదయాత్రకు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది.

పాదయాత్ర సమయంలో ఎన్ని కష్టాలు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలను విన్నారు లోకేష్. ఒక్కో ప్రాంతంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులను అక్కడికక్కడే శంకుస్థాపనలు చేశారు. తద్వారా టీడీపీపై ప్రజలకు నమ్మకం, భరోసాను కల్పించారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యువగళం యాత్ర డిసెంబర్ 18న విశాఖలోని గాజువాకలో ముగిసింది. దాదాపు 3వేల 132కిలో మీటర్లు సుధీర్ఘ ప్రయాణం చేశారు లోకేష్. 11 ఉమ్మడి జిల్లాల మీదుగా 226 రోజుల పాటు పాదయాత్ర చేశారు. తన పాదయాత్రతో ఒకవైపు జనాల సమస్యలపై ఫోకస్ చేస్తూనే మరోవైపు నిస్తేజంగా ఉన్న కేడర్‌లో కొత్త జోష్ తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై కొట్లాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తే గెలుపు సాధ్యమే అనే నమ్మకాన్ని కలుగజేశారు లోకేష్.

వాస్తవానికి ఏపిలో 13 జిల్లాలనూ కలుపుకుంటూ పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. కొన్ని అనుకోని కారణాల దృష్ట్యా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్రను చేపట్టలేక పోయారు. కానీ ఆ రెండు జిల్లాలు కవర్ అయ్యే విధంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సభను నిర్వహిస్తున్నారు. 70 ఎకరాల విస్తర్ణంలో దాదాపు 6 లక్షలు మంది హాజరయ్యేలా టీడీపీ నేతలు ఈ సభను సన్నద్ధం చేశారు. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు ఇప్పటికే ప్రత్యేక కమిటీల నియామకం చేపట్టి ఆ దిశగా పని చేస్తున్నారు. వివిధ హోదాలు కలిగిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా నిరంతరం పరిశీలన చేస్తూ సభ ఏర్పాట్లను దగ్గర ఉండి చేయిస్తున్నారు.

యువగళం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది టీడీపీ శ్రేణులు తరలివస్తున్నందున ఏ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ సభకు ఏడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి, రైల్వేకోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఈ నెల 19న ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఒక్కో రైలు లో 1300 మంది వరకు ఈ సభకు చేరుకోనున్నారు. వీటితో పాటు ఇతర ప్రాంతాలు నుండి పెద్ద ఎత్తున బస్సుల్లో కూడా రానున్నారు. దీంతో ఒక వైపు రైల్లు, మరో వైపు బస్సుల్లో పెద్ద యెత్తున టీడీపీ శ్రేణులు ఈ సభకు హాజరవనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తరలి రానున్న నేపథ్యంలో పార్కింగ్ నిమిత్తం పటిష్ట మైన చర్యలు తీసుకుంటున్నారు. సభకు చుట్టూ పక్కల ఉండే ఖాళీ స్థలాలు, లే ఔట్లలో పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ నుండే 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది టీడీపీ. వచ్చే ఎన్నికలు కోసం ఏ విధంగా సిద్ధ మవ్వాలి, తమ పార్టీ అనుచరించాల్సిన విధి విధానాలు, వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళలి, తమ పార్టీ అధికారంలోకి వేస్తే ఎలాంటి హామీలు, అభివృద్ధి అమలు చేయాలి వంటివి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా టీడీపీ అధిష్టానం సన్నద్ద మవుతుంది.

యువ గళం పాదయాత్ర చేపట్టిన సమయంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నారా లోకేష్ ఒక ఎర్రని బుక్కు ను మెయింటెయిన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కి చెందిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టడం, వారిని ఇబ్బంది చేస్తున్న అధికారుల లిస్టును ఆ బుక్ లో నోట్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ తగిన విధంగా బుద్ది చెప్పేందుకు ఆ బుక్ ను తమ అధినేత చంద్రబాబుకు ఈ సభా వేదిక ద్వారానే అందించనున్నట్లు ఇది వరకే లోకేష్ తెలిపారు. అక్రమంగా కేసులు పెట్టీ ఇబ్బందులు కు గురి చేసిన అధికారుల భరతం పడతానంటూ కార్యకర్తలుకు ధైర్యాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories