Tirupati By-Poll: 'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి' ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు - నారా లోకేష్

Nara Lokesh Tweeted That Punganoor Veerappan Peddireddy Is Violating Democracy
x

Tirupati By-Poll:( File Photo )

Highlights

Tirupati By-Poll: 'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి' ప్ర‌జాస్వామ్యాన్నిఖూనీ చేస్తున్నారు అని లోకేష్ ట్వీట్ చేశారు.

Tirupati By-Poll: 'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని లోకేష్ ట్వీట్ చేశారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు

'మంత్రి పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ క‌ల్యాణ మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్ చెప్పారు.

'తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల త‌ర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ముందే ఓ ప్రైవేటు బస్సును ఆపిన తెదేపా నేతలు బస్సులో ఉన్న వ్యక్తులను ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్‌ కూడలి వద్ద టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లపై ఏ మాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోగా తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో వైపు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఓట్లు వేసేందుకు గ్రామస్థులు ముందుకు రాకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోయింది. తమ పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేయరాదని నిరసనగా గ్రామస్థులు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు ఓటు వేయడానికి ప్రజలు నిరాకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories