రూ. 70 వేల కోట్ల పెట్టుబడులను వెనక్కి పంపించాడు : నారా లోకేష్

రూ. 70 వేల కోట్ల పెట్టుబడులను వెనక్కి  పంపించాడు : నారా లోకేష్
x
నారా లోకేష్, సీఎం జగన్మోహన్ రెడ్డి
Highlights

వైసీపీ ఆరునెలల పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

వైసీపీ ఆరునెలల పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అందులో.. 'వైసీపీ పాలనలో తెలుగు తల్లికి, తెలుగు భాషకీ, తెలుగు సంస్కృతికీ... మొత్తంగా తెలుగుదనానికే గడ్డురోజులొచ్చాయి. జాతీయ గీతాన్నే మర్చిపోయినోళ్ళకు ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఏం చేతనవుతుంది? ఇక యువనేస్తం పథకంతో నెలనెలా భృతి చెల్లించి, శిక్షణ ఇచ్చి.. యువతను వారి ప్రతిభకు తగ్గ రంగాల్లో ఉన్నతంగా చూడాలనుకున్నాం.

అలాంటిది ఆ పథకాన్ని ఆపేసి, నిరుద్యోగులకు భవిష్యత్తు లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. అని పేర్కొన్నారు. అంతేకాదు దేశంలో ఎవరైనా 'పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాం' అని అంటే వారిని చంద్రబాబు గారు ఏపీకి తీసుకెళ్ళి పోతారేమో అని మిగతా రాష్ట్రాలు భయపడేవి. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్ళిపోయే కంపెనీలని సునాయాసంగా వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటూ అదానీ గ్రూపు రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే వెనక్కి పంపించాడని.. అందుకే రివర్స్ పాలన అంటున్నారని లోకేష్ జగన్ పాలనపై ట్వీట్ల వర్షం కురిపించారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories