జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా? : నారా లోకేష్

జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా? : నారా లోకేష్
x
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్
Highlights

ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కోసం స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కోసం స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.83.80 కోట్ల ప్రజా ధనం ఆదా అయింది. గత నెల 30వ తేదీన 2,64,920 స్మార్ట్‌ ఫోన్ల కోసం దాఖలైన టెండర్లలో రూ.317.61 కోట్లు కోట్‌ చేస్తూ ప్రముఖ సంస్థ ఎల్‌-1గా నిలిచింది.

అయితే ఈ ధరపై ఈ నెల 2వ తేదీన రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్ళింది ప్రభుత్వం. ఈ క్రమంలో మరో సంస్థ రూ.233.81 కోట్లు కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. దీంతో రివర్స్‌ టెండరింగ్‌కు ముందు ఎల్‌-1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన ధర కంటే ఇది రూ.83.80 కోట్లు తక్కువకు టెండర్ వేసింది. అయితే ఈ టెండర్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు.

వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్.. వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి రూ.233 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అని విమర్శించారు. గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ లో రూ.83 కోట్లు ఆదా అంటూ చెవిలో క్యాబేజీ పెట్టారన్నారు.

వైకాపా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసిందని చెప్పారు. ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ గారు టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉందని అన్నారు. అంతేకాదు జగన్ గారి పారదర్శకత ప్రకారం రూ.100కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అని జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా అని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి లోకేష్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories