మరోసారి తనదైన శైలిలో ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డ నారా లోకేష్

మరోసారి తనదైన శైలిలో ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డ నారా లోకేష్
x
Highlights

సీఎం జగన్ మూడురాజధానుల ప్రతిపాదన నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ ప్రతిపాదన ప్రాంతీయ...

సీఎం జగన్ మూడురాజధానుల ప్రతిపాదన నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ ప్రతిపాదన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ప్రణాళిక ఎక్కడఉంది? అని ప్రశ్నించారు. విశాఖలో 70వేల ఉద్యోగాలు వచ్చే అదాని డేటా సెంటర్ ని, లులూ మాల్ ని తరిమేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు ప్రకాశంజిల్లాకి రావడానికి సిద్ధపడిన పేపర్ ఇండస్ట్రీ కూడా పారిపోయింది, తిరుపతికి వస్తాం అన్న జియో ఫోన్ల తయారీ కంపెనీ రిలయన్స్ వణికిపోయిందని ఎద్దేవా చేశారు. వైకాపా నాయకులు అన్నట్టు మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టినా ప్రతి వారం కోర్టు ముందు నిలబడే వ్యక్తిని చూసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? అని నారా లోకేష్ తనదైన శైలిలో ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.

ఇక బీసీజీ రిపోర్టుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే.. అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతోనే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి రాసిన స్క్రిప్ట్ నే మరోసారి బోగస్ రిపోర్ట్ పేరుతో బయటపెట్టారని దుయ్యబట్టారు. పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన సాటిలైట్ సిటీలు,టెక్నాలజీ హబ్ లు, అర్బన్ టౌన్ షిప్ లను గ్రీన్ సిటిలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడం వలన బిసిజి రిపోర్ట్ చిత్తశుద్ది ఏంటో అర్ధం అవుతుందని అన్నారు లోకేష్.

అన్ని నగరాల గురించి చెప్పిన రిపోర్టులో సంవత్సరానికి లాక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తున్న గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన సైబరాబాద్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని లోకేష్ బీసీజీ సంస్థకు ప్రశ్న సంధించారు. అంతేకాదు రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన ప్రాంతం అని చట్టబద్ధత ఉన్న శివ రామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని లోకేష్ వెల్లడించారు. కానీ అమరావతి ముంపునకి గురవుతుంది, భూమి స్వభావం వలన నిర్మాణ వ్యయం పెరుగుతుంది అంటూ అసత్య ఆరోపణలు చేసి కోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారని లోకేష్ అన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా జగన్ వక్ర బుద్ధి మారలేదని.. కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించినట్టుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories